కోనరావుపేట, డిసెంబర్ 30: మండలం లోని వెంకట్రావుపేట గ్రామంలో ట్రాక్టర్లో నాటు బాంబు కలకలంరేపింది. గ్రామానికి చెందిన గురుక ఎల్లయ్య అనే వ్యక్తి రోజు వారిగా తన ట్రాక్టర్ను గ్రామ శివారులో ఉన్న పొలం దున్నేందుకు ఆదివారం తీసు కువెళ్లాడు. ఈక్రమంలో తన పొలం దున్నిన తర్వాత మరో రైతు పొలంను దున్నేందుకు తీసుకువెళ్లి రాత్రి కావడంతో అక్కడే ఉంచా డు.
తిరిగి ఎల్లయ్య కుమారుడు ప్రణయ్ సోమవారం పొలం దున్నేందుకు ట్రాక్టర్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా సైలెన్సర్ నుండి నాటుబాంబులు బయటకు ఎగిరిపడ్డాయి. దీంతో సదరు డ్రైవర్ షాక్కు గురయ్యాడు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీ లించారు.
అసలు నాటుబాంబు ఎవ రు అమర్చారు, ఎక్కడ తయారు చేశారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక నాటుబాంబులు పేలకపోవడంతో ప్రాణ పాయం తప్పిందని, ఒకవేళ నాటుబాం బులు పేలి ఉంటే ఏమయ్యోదో అని బాధితుడు ప్రణయ్ వాపోయాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనను చంపేదుకు పన్నాగం పన్ని,రాత్రి సమయంలో ట్రాక్టర్ సైలెన్సర్లో నాటుబాంబులు అమర్చి ఉంటా రని బాధితుడు పేర్కోన్నాడు.
ఇది ఇలా ఉండగా గతంలో కూడా ధర్మారం, మరి మడ్ల గ్రామాలలో నాటు బాంబులు పేలడం తో జంతువులు, పశువులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. దీంతో నాటుబాంబుల తయారీదారులు, విక్రయదారులను గతం లో పోలీసులు పట్టుకుని కటాకటాల వెనక్కి నెట్టారు. ఇప్పుడు ఏకంగా మనుషుల ప్రాణాలు తీసేందుకు ట్రాక్టర్ సైలెన్సర్లో నాటుబాంబులు పెట్టడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.