స్ఫాక్స్ పోర్ట్, డిసెంబర్ 12: ట్యునీషియాలోని స్ఫాక్స్ పోర్ట్ నుంచి వలస దారులతో బయల్దేరిన ఓ పడవ మార్గమధ్యలోనే బోల్తా పడింది. అందులో ఉన్న అందరూ గల్లంతు కాగా.. ఓ 11 ఏండ్ల బాలిక మాత్రం ప్రాణాలతో బతికి బయటపడింది. సముద్రంలో తేలియాడుతున్న ఆ బాలికను గమనించిన కొంత మంది ఆ బాలికను కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఇటలీలోని లాంపెడుసా ద్వీప సమీపంలో ఈ ఘోర పడవ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ బాలిక కథ వింటే ఆశ్చర్యం వేయకమానదు. పడ వ మునిగిపోగా.. ఓ బాలిక ఆ సమయంలో సముద్రంలో తేలియాడు తూ అరిచింది. అటువైపుగా పడవలో వెళ్తున్న కొంత మంది అమ్మాయిని గమనించి ప్రాణాలు కాపాడారు. పడవలో 45 మందితో బయలుదేరగా.. బోటు మునిగిపోయినట్లు ఆ అమ్మా యి తెలిపిందని రెస్క్యూ బృందాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ అమ్మాయికి చికిత్స అందిస్తున్నారు.