25-04-2025 01:09:06 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్మూ కశ్మీర్‌లో పర్యాటక రంగానికి ఇది కీలకమైన సీజన్. మండు వేసవి నుంచి ఉపశమనం కలిగించే స్వర్గధామంలా ఈ ప్రాంతాన్ని పరిగణిస్తుంటారు. అయితే పర్యాటక ప్రాంతమైన పహ ల్గాంలో ఉగ్రదాడితో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్ నుంచి తిరుగు పయనమవుతోన్న పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.
శ్రీనగర్ విమానాశ్రయానికి వెళ్లే దారులు ట్యాక్సీలతో బారులు తీరగా.. హైవేలపై కూ డా పర్యాటకులను తీసుకెళ్లే వాహనాల సం ఖ్య భారీ స్థాయిలో ఉంది. జమ్మూ కశ్మీర్ పర్యటనకు ముందస్తు ప్లాన్ చేసుకున్నవారంతా ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేసుకుం టున్నారు. గతంలో కశ్మీర్‌లో ఉగ్రదాడులు జరిగినప్పటికీ మునుపెన్నడూ పర్యాటకులపై దాడులు జరగలేదు. అయితే పహల్గాం ఘటన కశ్మీర్ పర్యాటక పరిశ్రమను తీవ్ర ప్రభావితం చేయనుంది.
కశ్మీర్‌లోని ప్రము ఖ పర్యాటక ప్రాంతాలైన గుల్మార్గ్, హజన్ వ్యాలీ, తులిప్ గార్డెన్స్ ఎక్కువగా బుక్కవ్వగా తాజాగా అవన్నీ రద్దయ్యాయి. ఈ పరిస్థితుల్లో కశ్మీర్‌కు వెళ్లి తమ ప్రాణాలను పణం గా పెట్టబోమని, రీఫండ్ చేయాలని కోరుతున్నట్టు ఏజేన్సీ నిర్వాహకులు తెలిపారు. ఉగ్రదాడి అనంతరం కొంతమంది పర్యాటకులు కశ్మీర్‌కు బదులు వేరే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నట్టు ఢిల్లీలోని ట్రావెల్ ఏజెన్సీలు నివేదించాయి.
ఈ మూడు నెలలే కీలకం
వాస్తవానికి ఈ మూడు నెలలు కశ్మీర్ పర్యాటక రంగానికి చాలా కీలకం. వేసవి దృ శ్యా కశ్మీర్ అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పాఠ శాలలకు వేసవి సెలవులు కూడా కావడంతో దేశం నలుమూలల నుంచి కుటుంబసమేతంగా కశ్మీర్‌కు రావడం కనిపిస్తుంటుంది. ఇక్కడ నివసించే స్థానికులు టూరిస్ట్ గైడ్లుగా ఉపాధి పొందుతున్నారు.
వీరితో పాటు చాలా మంది చిరు వ్యాపారాలు చేసుకుం టూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరందరికి పర్యాటక రంగమే జీవనాధారం. అయితే ఉగ్ర దాడితో కశ్మీర్ స్థానికులు, వ్యాపారులు పెద్ద ఎత్తున ఉపాది కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
భయానక స్థితిలోనే పహల్గాం
ఉగ్రదాడితో పర్యాటక ప్రాంతం పహ ల్గాం ఇంకా భయానక స్థితిలోనే ఉంది. మం గళవారం జరిగిన మారణహోమంలో 26 మంది అమాయకులైన పర్యాటకులు బలైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన మూడు రోజులు కావొస్తున్న పరిస్థితి క్షణక్షణం భయంభయంగా అన్న తరహాలోనే ఉంది.
ఏ వైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియక అక్కడి స్థానికులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. మరోవైపు ఉగ్రదాడిలో మృతి చెందిన బాధితులను వారి స్వస్థలాలకు తరలించే ప్రక్రియను జమ్మూ ప్రభుత్వం వేగవం తం చేసింది.
పర్యాటకులు అనవసర ఆందోళనకు గురవ్వొద్దని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తెలిపింది. కేంద్ర సాయుధ బలగాలతో పహ ల్గాం ప్రాంతం మొత్తం రెండంచెల భద్రతను ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే భయంతో చాలా మంది పర్యాటకులు వెళ్లిపోతుండగా.. కొంతమంది మా త్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతను దృష్టిలో ఉంచుకొని ఉండేందుకు సుముఖత చూపుతున్నారు.
పర్యాటకం ఆర్థిక కార్యకలాపాలకు సూచిక
‘పర్యాటకం అంటే సాధారణ స్థితి కాదు. ఇది ఆర్థిక కార్యకలాపాలకు సూచిక. సాధారణ స్థితి అంటే భయం లేకపోవడం, ఉగ్రవాద దాడులు తగ్గడం, ప్రజలు స్వేచ్ఛగా జీవించడం. పర్యాటకులు కశ్మీర్ లోయ నుంచి వెళ్లిపోవడం చూస్తుంటే హృదయ విదా రకరంగా ఉంది’
ఒమర్ అబ్దుల్లా,
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి
కశ్మీర్‌లో పర్యాటక రంగంపై పడే నష్టాన్ని తగ్గిస్తాం
‘పహల్గాం దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో పర్యాటక రంగంపై పడే నష్టాన్ని తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యాటక శాఖ కార్యదర్శితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తున్నాం’
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
గజేంద్ర సింగ్ షెకావత్
పహల్గాంను సందర్శిస్తాం
‘దాడి గురించి వినగానే భయమేసింది. ముంబైకి తిరిగి వెళ్లాలనుకు న్నాం. కానీ హోటల్ సిబ్బంది మేం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండే లా చేశారు. భద్రతా ఏర్పాట్లు బాగున్నాయి. రేపు పహల్గాంను సందర్శిం చాలనుకుంటున్నాం’
మహారాష్ట్రకు చెందిన ఒక పర్యాటకురాలు
* ‘ఇది పాశవికమైన దాడి. ఇది కశ్మీర్‌కు, ఈ ప్రాంత పర్యాటక పరిశ్రమకు అత్యంత చెడ్డ వార్త’
జావెద్ అహ్మద్, స్థానిక హోటల్ వ్యాపారి
* ‘అంతా అయిపోయింది. నాకు కన్నీళ్లు వస్తున్నాయి. మా జీవితం పర్యాటకుల మీదే ఆధారపడి ఉంది. నేను బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఈ వ్యాపారం చేస్తున్నాను. నా వస్తువులు కొనడానికి ఎవరూ లేరు’
షకీల్ అహ్మద్, శాలువాలు అమ్ముకునే వ్యక్తి