30-04-2025 12:45:39 AM
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఆర్టికల్ 317 తొలగించిన తర్వా త జమ్ము కశ్మీర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. కశ్మీర్‌లో పోలీసులపై రాళ్లు రువ్వడం వంటి ఘటనలు తగ్గాయని, శాంతిసామరస్యం ఏర్పడిందన్నారు.
అయితే ఇది పాకిస్థాన్‌కు కంటగింపుగా మారిందని, అందుకే మళ్లీ రెచ్చగొడుతోందని మండిపడ్డారు. జమ్ము కశ్మీర్‌లో 75 సంవత్సరాల తర్వాత బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోందని, భారతదేశంలో జమ్ము కశ్మీర్ అంతర్భాగంగా ప్రపంచమంతా అంగీకరిస్తోందని, అయి తే, ఇది మన దేశంలోని కొన్ని అంతర్గత శక్తులకు ఇష్టంలేదని తెలిపారు. జమ్ము కశ్మీర్ మాదేనంటూ మాట్లాడుతున్న పాకిస్థాన్‌కు కూడా ఇది ఇష్టం లేదన్నా రు.
అందుకే, భారతదేశంలో శాంతిని, సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో దేశంలో అనేక ప్రాం తాల్లో బాంబు పేలుళ్లు, కర్ఫ్యూలు, మతకల్లోహాలు, ఉగ్రవాద సంబంధిత కార్యక్రమా లు జరిగేవని విమర్శించారు. నరేంద్ర మో దీ ప్రధానమంత్రి అయ్యాక జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టే ప్రయత్నం చేశారని చెప్పారు.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ర్ట పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావే శానికి ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ హాజరయ్యారు. హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు లో, కోఠిలోని గోకుల్ చాట్‌లో, దిల్‌షుఖ్‌నగర్ కూడా బాంబు పేలుళ్ల ఘటనలు జరిగా యని ఆయన గుర్తు చేశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెర్రరిజంపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలం భిస్తూ ఉగ్రవాదాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని అంతర్గత సమస్యలను ఎదుర్కోలేక, దేశ ప్రజలకు తిండి, ఉపాధి కల్పించలేక, దృష్టిని మరల్చడానికి జమ్మూ మరోసారి బాంబుదాడులను ప్రేరేపించేందుకు కుట్ర లు చేస్తున్నదని మండిపడ్డారు.
ఇటీవల ప హల్గాంలో అమాయక హిందువులను వా రి కుటుంబ సభ్యుల ఎదుటే.. అతికిరాతకంగా ఉగ్రవాదులు కాల్చిచంపారని, దీనికి నిరసనగా భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు పహల్గాం ఉగ్రవాద ఘటనను ఖం డించాయన్నారు. ఉగ్రవాద దాడికి సంబంధించి బాధితులకు న్యాయం చేసేలా, దోషు లను శిక్షించేలా చర్యలు తీసుకుంటామని స్వ యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారన్నారు.
ఈ నేపథ్యంలో మనమంతా దేశ ప్రజలందరినీ సంఘటితం చేసి ఉగ్రవాదానికి, రక్తపాతానికి వ్యతిరేకంగా ప్రజల మ ద్దతు కూడగట్టి దేశంలో శాంతి, సామరస్యం తో ఉండేలా ముందుకెళ్లాలని నేతలకు సూ చించారు. గ్రామగ్రామన ప్రజలందరూ రాజకీయాలు, కులాలకతీంగా ఏకమై పహల్గాం లో జరిగిన ఉగ్రవాద ఘటనకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారని తెలిపారు.
ఇదిలా ఉంటే, మొన్న జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మ జ్లిస్ పార్టీని ఎదుర్కొనే ఘనత బిజెపికే ఉంద ని స్పష్టమైన సంకేతం తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ నగర ప్రజలకు బీజేపీ పార్టీ ఇ చ్చిందని ఆయన తెలిపారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రవాద సంఘటనకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించారు.