calender_icon.png 15 October, 2024 | 5:52 AM

కనువిందు చేసిన తోకచుక్క

15-10-2024 01:35:27 AM

లండన్, అక్టోబర్ 14: అకాశంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. 80,000 వేల సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చి ఒక మెరుపు మెరిసే ‘సుచిన్షాన్ అట్లాస్’ (సీ 2023 ఏ3) తోకచుక్క ఆదివారం భూమికి అత్యంత దగ్గరగా కేవలం 44 మిలియన్ మైళ్ల దూరంలోకి వచ్చింది.

మంగళవారం సాయంత్రం శుక్ర గ్రహం వైపు వెళ్తూ ఇంగ్లాండ్ పౌరులకు ఆకాశంలో తోకచుక్క కనువిందు చేసింది. స్కై వాచర్స్, ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. బైనాక్యులర్‌ను చేతబట్టి విను వీధిలో ఆవిష్కృతమైన అద్భుతాన్ని తిలకించారు.