calender_icon.png 8 October, 2024 | 12:13 PM

జొమాటో సీఈవోకు చేదు అనుభవం

08-10-2024 01:42:44 AM

 లిఫ్ట్ ఎక్కనివ్వని సెక్యూరిటీ సిబ్బంది

గురుగ్రామ్, అక్టోబర్ 7: తమ సిబ్బంది ఎదుర్కొటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జొమాటో సంస్థ సీఈఓ దీపిందర్ గోయెల్ అవతారమెత్తగా, ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. గురు గ్రామ్‌లో డెలివరీ బాయ్‌గా ఆర్డర్ తీసుకునేందుకు ఓ మాల్‌లోకి వెళ్తుండగా.. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను లిఫ్ట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.

తనను మెట్ల మార్గం లో వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారని ఓ వీడియోను గోయెల్ ఎక్స్‌లో పోస్ట్ చేశా రు. హల్దీరామ్స్‌లో ఆర్డర్‌ను పిక్ చేసుకునేందుకు మాల్‌కు వెళ్లగా తనకు ఇలాంటి అను భవం ఎదురైందని వివరించారు. చివరకు మెట్ల మార్గంలోనే మూడో అంతస్తుకు వెళ్లి ఆర్డర్ తీసుకున్నట్లు చెప్పారు.

ఈ సంఘటనతో డెలివరీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మా ల్స్‌తో కలిసి జొమాటో మరింత క్లోజ్‌గా పనిచేయాల్సి ఉందన్న విషయం తనకు అర్థమైందని పేర్కొన్నారు. ‘మీరేమనుకుంటున్నారో అభిప్రాయం చెప్పండి’ అంటూ నెటిజన్లను కోరారు.