calender_icon.png 10 January, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాస్త మెచ్యూర్డ్‌గా..

13-12-2024 12:00:00 AM

జీవితంలో ప్రతిబంధం ముఖ్యమే. అందులో భార్యాభర్తల బంధం ఇంకా ప్రధానమైనది. పరిణతిగా ఆలోచించే మహిళలు తమ అనుబంధంలో ఎంతో పరిపక్వతగా ఆలోచిస్తారు. తమ అనుబంధానికి బలమైన పునాది వేయడానికి ప్రయత్నిస్తారు. అందులో ఒకటి మెచ్యూర్డ్‌గా ఆలోచించడం. ఏ బంధంలోనైనా హెచ్చుతగ్గులు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు గొడవలు, కొన్నిసార్లు ప్రేమలు పెరుగుతూనే ఉంటాయి. ఆ సమయంలో కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తే సమస్య చిన్నగా కనిపిస్తుంది. చాలామంది జీవిత భాగస్వామి చేసే పనులు నచ్చకపోతే వారిపై పగ తీర్చుకు నేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మెచ్యూర్డ్‌గా ఆలోచించే వారు మాత్రం పగలు పెట్టుకోరని అధ్యయనాలు చెబుతున్నారు. సమస్యలను పరిష్కరించుకొని ముందు కు సాగుతారు. ఎక్కడివి అక్కడే మర్చిపోతారు. సంతోషకరమైన, నిబద్ధతగల సంబంధాన్ని కొనసాగించ డానికి ఇష్టపడతారు.భాగస్వామిలోని మైనస్ పాయింట్లు, ప్లస్ పాయింట్లు ఉంటాయని అంటారు. వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తారు.