పసిడి పతకం బహుకరించిన గ్రామస్థులు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆదివారం వినేశ్ పుట్టినరోజు పురస్కరించుకొని ఆమె స్వగ్రామం బలాలిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బలాలి గ్రామస్థులు వినేశ్‌కు పసిడి పతకాన్ని బహుకరించారు. ఒలింపిక్స్‌లో బరువు కారణంగా పతకం చేజారినప్పటికీ తమ దృష్టిలో వినేశ్ బంగారు పతక విజేతగానే భావిస్తామని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. వినేశ్ మాట్లాడుతూ.. ‘నా పోరాటం ముగియలేదు. భారత అమ్మాయిల కోసం ఇప్పుడే నా పోరాటం మొదలైంది.
ఒలింపిక్స్ ఫైనల్లో ఆడనందుకు చాలా బాధపడ్డా. నాకు బహుకరించిన స్వర్ణ పతకం ముందు మరేది గొప్ప కాదు’ అని పేర్కొంది. పారిస్ క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన వినేశ్‌కు వంద గ్రాముల అధిక బరువు కారణంగా వరల్డ్ రెజ్లింగ్ బాడీ ఆమెపై అనర్హత వేటు వేసింది. దీంతో వినేశ్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. అయితే కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లోనూ వినేశ్‌కు చుక్కెదురైన సంగతి తెలిసిందే.