22-10-2024 01:10:01 AM
న్యూ ఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రం జీ ట్రోఫీలో ముంబై జట్టు తొలి విజయా న్ని నమోదు చేసింది. గ్రూ ప్ భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో బరోడాతో ఘోర ఓటమి అనంతరం ఈ మ్యాచ్ విజయం ముంబైకి ఊరట కలిగించింది. 74 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 13.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయాన్ని అందుకుంది.
పృథ్వీ షా (39 నాటౌట్), హార్దిక్ టమోర్ (21 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. తొలి ఇన్నింగ్స్‌లో మహారాష్ట్రను 126 పరుగులకు ఆలౌట్ చేసిన ముంబై ఆయుశ్ హత్రే, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో కదం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 441 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కోలుకున్న మహారాష్ట్ర 388 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ గైక్వాడ్ (145), అంకిత్ బవ్నె (101) సెంచరీలు సాధించారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకు ఆలౌట్ కావడం మహారాష్ట్రను ఓటమి నుంచి గట్టెక్కించలేకపో యింది. ఇదే గ్రూప్‌లో ఉన్న బరోడా రెండో విజయాన్ని సాధించి పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బరోడా 65 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఇక ఎలైట్ గ్రూప్ -బిలో ఆడుతున్న హైదరాబాద్ జట్టు వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఉత్తరాఖండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ 78 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఎలైట్ గ్రూప్-డిలో ఛండీఘర్ అస్సాంపై 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 83 పరుగుల లక్ష్యం తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన చంఢీఘర్ 17.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.
మిగిలిన మ్యాచ్‌ల్లో మేఘాలయాపై త్రిపుర ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ఆంధ్రపై గుజరాత్, పాండిచ్చెరిపై విదర్భ, హిమాచల్ ప్రదేశ్‌పై రాజస్థాన్‌పై విజయాలు సాధించాయి. ఐదు మ్యాచ్‌లు డ్రాగా ముగియగా.. ఎలైట్ గ్రూప్-సిలో బెంగాల్, బిహార్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది.
అక్టోబర్ 26 నుంచి ఎలైట్ గ్రూప్‌లో మూడో రౌండ్ మ్యాచ్‌లు మొదలవనున్నాయి. ఇక ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌ల్లో గోవా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో సిక్కింపై విజయాన్ని అందుకోగా.. మణిపూర్‌పై నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌పై మిజోరం విజయాలు అందుకున్నాయి.