10-03-2025 12:00:00 AM
మంథని, మార్చి 9 (విజయక్రాంతి): ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంలోనే పెద్దపులులు, సింహాలు ఏనుగులు అడవి జంతువులు ఉండేవి. మరి ఇప్పుడు వాటికి ఏమనిపిస్తుందో ఏమో కానీ అరణ్యం విడిచి గత మూడు సంవత్సరాలుగా పెద్దపులి ఇప్పుడు పెద్దపెల్లి జిల్లాలో ని పల్లెల్లో పులి సంచరిస్తుంది.
మొన్న భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల లో నిన్న పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ లో పోతారం, మైదం బండలో నేడు మంథని మండలంలోని బిట్టుపల్లి, రచ్చపల్లి గ్రామ శివారులో పెద్దపులి జాడలు కనిపించడంతో పెద్దపులి పల్లెల్లో సంచరిస్తుందని తెలవడం తో అటవీశాఖ అధికారులు పులి జాడ కోసం అన్వేషిస్తుంటే పల్లెల్లోని ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు.
బిట్టుపల్లికి చేరుకున్న అధికారులు
పెద్దపులి బిట్టివెల్లిలో కనిపించిందని గ్రామస్తులు అటు విషయక అధికారులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన స్పందించిన అటవీశాఖ జిల్లా అధికారి శివయ్య శనివారం అర్ధరాత్రి వరకు గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వెతకగా పులి అడుగులు కనిపించాయి. దీంతో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రజలపై దాడి చేయకముందే పులిని బంధిం చాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. పెద్దపులికి హాని చేయొద్దు: జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య
పెద్దపులి ముంథని ప్రాంతంలో సంచరిస్తున్నది నిజమేనని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులికి ఎలాంటి హాని చేయొద్దని జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య ప్రజలను కోరారు. పెద్దపులి గత వారం రోజులుగా అదిలాబాద్ జిల్లా చెన్నూరు మీదుగా గోదావరి దాటి మంథని, ముత్తారం మండలాల్లో సంచరిస్తుందని.
ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్, మైదం బండ, పోతారం మీదుగా తిరుగు ప్రయాణం అయిందని, ఇప్పుడు మంథని మండలం బిట్టుపల్లి మీదుగా గోపాలపూర్, ఖానాపూర్ ఖాన్ సాయిపేట మీదుగా గోదారి దాటేందుకు అదిలాబాద్ జిల్లాలోని దాని స్థానానికి పోయేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. తమ అధికారులు పెద్దపులిని ట్రాప్ చేస్తున్నారని జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య తెలిపారు.