calender_icon.png 2 January, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సంపేటలో అడుగుపెట్టిన పెద్దపులి

30-12-2024 02:26:36 AM

* జంగాలపల్లి తండాలో పాదముద్రలు

జనగామ, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న పెద్దపులి మరో మండలంలో అడుగుపెట్టింది. కొన్ని రోజులుగా ములుగు జిల్లాలో పెద్దపులి సంచరించగా.. ఇటీవలే వరంగల్ జిల్లాలో పులి అడుగు జాడలు కనిపించా  ఆదివారం నర్సంపేట మండలంలోని రాజుపేట శివారు జంగాలపల్లి తండా సమీపంలో పులి పాదముద్రలు కనిపించాయి.

ఒకే పులి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ ముందుకు సాగుతుండటంతో దాని అడుగుజాడలు రోజుకో చోట కనిపిస్తున్నట్లు అధి కారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, ఎలాంటి హానీ తలపెట్టవద్దని అధికా రులు కోరుతున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.