calender_icon.png 22 November, 2024 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతకు పెద్దపీట

22-11-2024 01:45:07 AM

  1. సిద్ధమవుతున్న 22 మహిళా శక్తి భవనాలు
  2. శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ 
  3. తొలివిడతలో 1000 మెగా వాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు
  4. మొదటి దశలో 150 బస్సుల కొనుగోలు
  5. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

హైదరాబాద్, నవంబర్ 21 (విజయ క్రాంతి): మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభు త్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాష్ర్టంలోని మహిళలను కోటీశ్వరులను చేయాల న్న సీఎం సంకల్పంలో భాగంగా మహిళా స్వయం సహాయక బృందాలతో బస్సుల కొ నుగోలు, సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటు, శిల్పారామంలో ఇందిరా మహిళాశక్తి బజార్‌ల ఏ ర్పాటు పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలుపై గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ 22 ఇందిరా మహిళ శక్తి భవనాల నిర్మాణాలను 8 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించా రు. స్వయం సహాయక మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం కోసం శిల్పా రామంలో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

దాదాపు 106 షాప్‌లతో ఏర్పాటు చేస్తున్న ఈ బజార్ పనులు డిసెంబర్ మొదటివారంలోగా పూ ర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ బజార్‌లో వివిధ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు చేసేందుకు మహిళలకు ఆర్థిక చేయూత కోసం నగరంలోని ఐటీ, ఇతర వాణిజ్య, వ్యాపార సం స్థలకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. 

బస్సుల నిర్వహణకు ప్రణాళిక..

మహిళా సంఘాలతో కొనుగోలు చేయిం చే బస్సులను ఆర్టీసీ ద్వారా నిర్వహించేందు కు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని, దీని లో భాగంగా మొదటిదశలో 150 బస్సుల కొనుగోలును వెంటనే చేపట్టనున్నట్టు స్ప ష్టం చేశారు.

బస్సుల నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీ చేపడుతుందన్నారు. మహిళా సంఘా ల ద్వారా 4,000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్‌ప్లాంట్ల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్నామని, మొదటి దశలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు.

నీటిపారుదల, దేవాదాయ, అటవీశాఖల్లో నిరుపయో గంగా ఉన్న ఖాళీ భూములను లీజు పద్ధతి లో సేకరించి ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సోలార్ ప్లాంట్ల ఏ ర్పాటుకు మహిళా సంఘాలకు జీరో వడ్డీ రు ణాలను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు అనంతరం వీటి నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రెడ్కో, విద్యు త్ డిస్కంలు చేపడుతాయని స్పష్టం చేశారు.

సమావేశంలో రవాణా, రోడ్డు, భవనాల శా ఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియల్, రెవెన్యూ శా ఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎండోమెంట్స్ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్య ర్, పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి అ హ్మద్ నదీమ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్,సెర్ప్ సీఈవో దివ్య తదితరులు పాల్గొన్నారు.