calender_icon.png 18 April, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమానికి పెద్దపీట

11-04-2025 01:39:31 AM

మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 

నల్లగొండ, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని పలుచోట్ల ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి సన్నబియ్యం పంపిణీ చేసి ఓ లబ్ధిదారు ఇంట్లో సన్నబియ్యం భోజనం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సన్నబియ్యం ఎలా ఉన్నాయని వారిని అడగడంతో గతంలో దొడ్డు బియ్యం తినలేకపోయాం.. ఇప్పుడు సన్నబియ్యంతో కడుపు నిండా తింటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని  గడిచిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో హామీలను అమలు చేసి ప్రజా పాలన అందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటుందని అన్నారు..