02-04-2025 12:26:49 AM
- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని ఓ రేషన్ షాప్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆహార భద్రత కార్డు ఉన్న లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ ఉగాది పండుగ చరిత్రపుటలో నిలిచిపోతుందన్నారు దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలకు ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్, నార్సింగ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు గణేష్ గుప్తా పాల్గొన్నారు.