20-03-2025 12:00:00 AM
శాసనసభలో 2025- 26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు మల్లు భట్టి విక్రమార్క 3,04,965 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీనిలో రెవిన్యూ వ్యయానికి 2,26,982 కోట్లు, మూలధన వ్యయానికి 36,054 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయానికి ఎక్కువగా ప్రతిపాదించడం ఒకరకంగా స్వల్ప కాలంలో ఆస్తులు సృష్టించడానికి ఉపయోగ పడుతుంది.
ఇంకా బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు 31, 605 కోట్లు, వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు, వైద్య ఆరోగ్య రంగానికి 12,393 కోట్లు, రైతు భరోసా కు 18 వేల కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 2,862 కోట్లు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలానికి 550కోట్లు కేటాయించడం శుభ పరిణామం.
డాక్టర్. కోడూరి శ్రీవాణి, అర్థశాస్త్ర విభాగపు అధిపతి, శాతవాహన విశ్వవిద్యాలయం