calender_icon.png 9 January, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మలయాళంలో భారీ చిత్రం నిర్మాణం

04-01-2025 12:00:00 AM

కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా మలయాళంలో ఓ చిత్రం నిర్మించనుంది. డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్‌తో చిదంబరం దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతోంది. వెంకట్ కే నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెం ట్ సందర్భంగా నిర్మాత వెంకట్ కే నారాయణ మాట్లాడుతూ..- భాషలకు అతీతంగా ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనేది మా సంస్థ లక్ష్యం. ఈ క్రమంలోనే మలయాళ చిత్ర పరిశ్రమలోకి భారీ చిత్రాన్ని తీసుకురాబోతున్నాం” అన్నారు. డైరెక్టర్ చిదంబరం మాట్లాడుతూ.. “ఇలాంటి గొప్ప మూవీ కోసం నేను ఎదురుచూస్తున్నా ను.

ప్యాషనేట్ టీమ్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీ గా ఉంది. మా విజన్‌ను త్వరలోనే ప్రేక్షకులకు చూ పించేందుకు సిద్ధమవుతున్నాం” అన్నారు. జితూ మాధవన్ మాట్లాడుతూ.. “నా మనసుకు దగ్గరైన కథ ఇది. ఇలాంటి బ్యూటిఫుల్ టీమ్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఒక మంచి మూవీని అందిస్తామని చెప్పగలను” అన్నారు.