15-03-2025 12:00:00 AM
రూ. 25.41కోట్లతో ఆధునికీకరణ పనులు
ఖమ్మం, మార్చి 14 ( విజయక్రాంతి ): రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏ.బి.ఎస్.ఎస్.) కింద ఖమ్మం రైల్వే స్టేషన్ ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు.అన్ని హంగులతో సర్వంగా సుంద రంగా ముస్తాబవుతోంది. ఖమ్మం రైల్వే స్టేషన్ కు ఎంతో చరిత్ర వుంది.
19వ శతాబ్దం నాటి కాలంలో నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే (ఎన్.జి.ఎస్.ఆర్) ప్రాజెక్టులో భాగంగా దీనిని నిర్మించారు. ఈ స్టేషన్ హైదరాబాద్ను విజయవాడతో అనుసంధాన్నిస్తుం ది. బ్రిటిష్ కాలంలో, సమీపం లోని సింగరేణి బొగ్గు గనుల నుండి బొగ్గు, సున్నపు రాయి ఇతర ఖనిజాలను రవాణా చేయడంలో ఈ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుంది.
స్వాతంత్య్రం తర్వాత, నూతన రైళ్లను ప్రవేశపెట్టడంతో స్టేషన్ ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంది. ఖమ్మం రైల్వే స్టేషన్ ఢిల్లీ - చెన్నై, హైదరాబాద్ - విజయవాడ రైల్వే లైన్ల కూడలిలో వ్యూహాత్మకంగా దీని నిర్మాణం జరిగింది.బొగ్గుకు ప్రధాన రవాణా కేంద్రం గా పనిచేస్తూ సిమెంట్, ఉక్కు, కాగితపు పరిశ్రమలు వంటి అనేక పరిశ్రమలతో స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది.
విస్తృత సేవలందిస్తున్న ఖమ్మం స్టేషన్
నాన్-సబర్బన్ గ్రేడ్-3 (ఎన్.ఎస్.జి-3)స్టేషన్ గా వర్గీకరించబడిన ఖమ్మం రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ‘కాజీపేటవిజయవాడ సెక్షన్లో నున్న ఈ స్టేషన్ రూ 29.64 కోట్ల వార్షిక ఆదాయంతో సగటున రోజుకు 12,988 మంది ప్రయాణీకుల రాకపోకలతో ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది.
ఖమ్మం స్టేషన్లో దాదాపు 83 రైళ్లు ఆగుతాయి.
‘ఈ స్టేషన్ ముఖ్యమైన సూపర్ఫాస్ట్ రైళ్లకు న్యూఢిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి వంటి అనేక గమ్యస్థానాలకు స్టాప్లను కలిగి ఉంది. రూ. 25.41కోట్లతో అభివృద్ధి పనులు ప్రస్తుతం ఖమ్మం రైల్వే స్టేషన్ దాదాపు రూ. 25.41 కోట్ల అంచనా వ్యయంతో పునర్ నిర్మాణం చేపట్టారు. ఎయిర్ కండిషన్డ్ వేచియుండు గదులు, ఎస్కలేటర్లు, మెరుగైన ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో మరిం త పునరాభివృద్ధి చెందుతోంది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రణాళికబద్దంగా అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగం గా స్టేషన్ భవనం ముఖద్వారం అభివృద్ధి, ఆకర్షణీయ మైన ప్రవేశ ద్వారం ఏర్పాటు, ప్రయాణీకుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదాచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణంతో పాటు 2 లిఫ్టులు, 2 ఎస్కలేటర్ల ఏర్పాటు చేస్తున్నారు.
ప్లాట్ఫామ్ ఉపరితల మెరుగుదలతో పాటు ప్లాట్ఫార్ప అదనపు కప్పు ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటికే ఉన్న టాయిలెట్లకు మెరుగుదల, దివ్యాంగుల సౌకర్యాలతో సహా కొత్త టాయిలెట్ బ్లాకుల నిర్మాణం జరుగుతుంది. ఇంకా వెయిటింగ్ హాల్ అభివృద్ధి, స్టేషన్ వినియోగదారులకు ఆహ్లాదకరమైన ప్రాకృతిక అనుభవాన్ని అందించడా నికి స్టేషను ఆవరణలో పచ్చదనాన్ని పెంచ డం, ట్రాఫిక్ సజావుగా సాగడానికి స్టేషన్ ప్రాంగణం మెరుగుదల, స్టేషన్ ప్రాంతాలలో కళలు,సంస్కృతి చిత్రీకరణ జరుగు తుంది.
ప్రయాణీకులకు అనుకూలమైన సం కేతాలు, రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు మొదలైనవి ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటివరకు మొత్తం 45 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. అన్ని పనులు ఏకకాలంలో పురోగతిలో ఉన్నాయి. రాబోయే కొన్ని నెలలలో పనులు పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించారు.
పూర్తయిన పనులు, జరుగుతున్న పనులు
12 మీటర్ల వెడల్పు గల గ్యాంగ్వే తయారీ, నిర్మాణం, షీటింగ్ పనులు పూర్తి కావచ్చాయి.జనరల్ వెయిటింగ్ హాల్ పనితో పాటు రిటైరింగ్ గదులు ఫాల్స్ సీలింగ్, ఫ్లోరింగ్ పూర్తి అయింది.తాత్కాలిక బుకింగ్ ఆఫీస్ పనులు, ప్లాట్ ఫారం-1, ప్లాట్ ఫారం-2 పై 7 స్పాన్లలో సి.ఓ.పి-15 స్పాన్ల కోసం స్తంభాలు,పర్లిన్ల నిర్మాణం పూర్తి అయింది.
అయితే 12 మీటర్ల వెడల్పు గల పాదాచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి) ర్యాంప్ల తయారీ నిర్మాణం పురోగతిలో ఉంది.లిఫ్ట్లు, ఎస్కలేటర్లకు ఫౌండేషన్ పనులు, తయారీ పురోగతిలో ఉన్నాయి. ఎ.సి లాంజ్ కోసం గోడల ప్లాస్టరింగ్ పనులు, సి.ఓ.పిల గట్టర్ ఫిక్సింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి.