* దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు అందించండి
* జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): మహిళ చదివితేనే మంచి భవిష్యత్తు తమ సొంతం అవుతుందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం బేటి బచావో బేటి పడావోలో భాగంగా బుధవారం జిల్లా కార్యాలయ సముదాయం నుండి ఎంవీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు టూ వీలర్ వెహికల్ ర్యాలీ నిర్వహిం ఛారు.
ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జెండా ఊపి ప్రారంభించారు. ఏకగత.. చదవాలనే సంక ల్పం ఎదగాలనే కోరిక బలంగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని పేర్కొన్నారు. దివ్యాంగుల జిల్లా కమిటీ సమావేశంలో కలె క్టర్ హాజరై మాట్లాడారు దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను పూర్తి స్థా యిలో అందించాలని సూచించారు.
అంద వలసిన అన్ని సదుపాయాలను అందుబా టులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారిణి జరీనా బేగం, ఎంవిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మావతి,లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారిణి మంజుల, పోలీస్ డిపార్టుమెంటు శాఖ షి టీమ్స్, సిడి పివోలు, సూపర్ విసోర్స్ మహిళా ఉద్యో గులు, విద్యార్థులు మహిళా, శిశు, దివ్యాం గుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ నున్సి, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, దివ్యాంగులు ఉన్నారు.