calender_icon.png 27 October, 2024 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మనసులను తాకే ఓ అందాల రాక్షసి

27-10-2024 12:00:00 AM

దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు షెరాజ్ మెహదీ. ఆయన ప్రస్తుతం ‘ఓ అందాల రాక్షసి’ చిత్రంతో మరోమారు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. షెరాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయనే హీరో కాగా.. విహాన్షి హెగ్డే, కృతివర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నేహా దేశ్‌పాండే, సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ, అనంత్‌బాబు, ప్రియా, కృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించింది.

ఈ సమావేశంలో డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. “ఓ అందాల రాక్షసి’ గ్లామర్ బేస్డ్ చిత్రం కాదు. మంచి కంటెంట్ ఉన్న ఉమెన్ ఓరియెంటెడ్ మూవీ. అమాయక మహిళలు కొందరి చేతిలో ఎలా మోసపోతున్నారో సినిమాలో చూపిస్తూ, మోసం చేసేవారికి శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నాం. త్వరలోనే థియేటర్లలో విడుదల చేస్తాం” అని తెలిపారు.

హీరోయిన్ విహాన్షి హెగ్డే మాట్లాడుతూ.. ‘నా క్యారెక్టర్‌లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. కథలో కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ కూడా ఉంది’ అన్నారు. మరో హీరోయిన్ నేహా దేశ్‌పాండే మాట్లాడుతూ.. “ప్రేక్షకుల మనసులను తాకే కంటెంట్‌తో ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రాబోతోంది” అన్నారు.

‘45 రోజుల షూటింగ్‌తో టాకీ, సాంగ్స్ కంప్లీట్ చేసుకున్నాం. హైదరాబాద్, గోవా, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం’ అని రైటర్ భాష్యశ్రీ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కావేటి ప్రవీణ్; కొరియోగ్రఫీ: సాయిరాజ్; కథ, మాటలు, పాటలు: భాష్యశ్రీ; యాక్షన్: షావోలిన్ మల్లె; ఎడిటర్: డీవీ ప్రభు; సహ నిర్మాత: తేజిందర్ కౌర్.