calender_icon.png 3 March, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

170 ఏళ్ల అందమైన ప్రయాణం

02-03-2025 12:00:00 AM

లెవీస్ జీన్స్ అంటే స్టయిల్‌కు, క్వాలిటీకి మారుపేరు. ఇది ప్రపంచంలోని ప్రసిద్ధ జీన్స్ బ్రాండ్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ బ్రాండ్.. నేడు అత్యంత ప్రాచుర్యం పొందిన డెనిమ్ బ్రాండ్‌లలో ఒకటిగా కొనసాగుతున్నది. లెవీస్ జీన్స్ 170 ఏళ్ల కథ గురించి తెలుసుకుందాం.. 

లెవీ స్ట్రాస్ 1853లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు. అతని దగ్గర తరచుగా వస్త్రాలుకొనే జేకబ్ డేవిస్ అనే టైలర్‌కు ఒక సమస్య ఉండేది. అతని కస్టమర్ల ప్యాంటు జేబులు తరచుగా చిరిగిపోయేవి. గనుల్లో పనిచేసే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉండేది. అయితే జేకబ్‌కు ఒక ఆలోచన వచ్చింది.

అతను ప్యాంటు జేబులకు రాగి రివెట్స్ (చిన్న బటన్లు) పెట్టి వాటిని బలంగా చేశాడు. ఈ డిజైన్ చాలా బాగుంది. కానీ జేకబ్ దగ్గర పేటెంట్ చేయడానికి డబ్బు లేదు. అప్పుడు జేకబ్ లెవీ స్ట్రాస్ దగ్గరకు వెళ్లి తన ఆలోచన గురించి చెప్పాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేయవచ్చని చెప్పాడు. లెవీ ఒప్పుకున్నాడు. అలా లెవీస్ జీన్స్‌కు ప్రజాదరణ బాగా పెరిగింది.

కౌబాయ్స్, కార్మికులు ఈ జీన్స్‌ను ఎక్కువగా ఇష్టపడేవారు. ఇవి మన్నికగా ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్లూ జీన్స్‌కు క్రేజ్ పెరిగింది. ఆ సమయంలో రక్షణ కోసం పనిచేసేవారికి బ్లూ జీన్స్ అవసరంగా మారింది. ఆనాటి నుంచి నేటి వరకు ఈ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద డెనిమ్ బ్రాండ్‌లలో ఒకటిగా ఉంది.