calender_icon.png 3 October, 2024 | 3:55 AM

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి

03-10-2024 02:08:38 AM

  1. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి
  2. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాం తి): పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బుధవా రం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పం చాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని.. లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

బీసీ రిజర్వేషన్ల కోసం 30 ఏండ్లుగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. రాజకీయ పార్టీలు బీసీలను దీనావస్థకు తీసుకొచ్చాయన్నారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. జనాభా లెక్కల్లో బీసీ కులాల వారీగా జాబితాలను సేకరించాలని, కేంద్ర స్థాయిలో రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.