calender_icon.png 15 January, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి

11-07-2024 02:04:02 AM

  1. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
  2. హక్కుల సాధనకు అన్ని సంఘాలు కలిసిరావాలి
  3. బీసీ మేధో మదన సదస్సులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
  4. కులగణనకు కాంగ్రెస్ మద్దతు: మాజీ ఎంపీ వీహెచ్

ముషీరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి.. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు కలిసి కట్టుగా మన హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లో సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణ అధ్యక్షతన ‘బీసీ మేధో మదన సదస్సు’ జరిగింది. ఈ సదస్సుకు పలు వర్సీటీల నుంచి ప్రొఫెసర్లు, 28 బీసీ సంఘాలు, 36 కుల సంఘా లు, 48 ఉద్యోగ సంఘాల నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బీసీ నేతలు హాజరయ్యారు. సమావేశంలో పలు తీర్మాణాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సదస్సుకు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్ల్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో  ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ల విద్యాభివృద్ధ్దికి ప్రత్యేక స్కీంలను రూపొందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కులగణన కూడా చేపట్టాలని కోరారు. అలా గే పంచాయతీ రాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 52 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రిమీలేయర్‌ను తొలగించాలని అన్నారు.

రాష్ట్రం లో, కేంద్రంలో.. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతూ.. కులగణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబ డి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీ య కన్వీనర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మ న్ నీల వెంకటేశ్ ముదిరాజ్, ఎర్ర సత్యనారాయణ, గొరిగె మల్లేష్ యాద వ్, గుజ్జ సత్యం, అనంతయ్య, వేముల రామకృష్ణ, జక్కుల వంశీకృష్ణ, మట్ట జయంతి తదితరులు పాల్గొన్నారు.