భయంతో పరుగులు పెట్టిన ప్రజలు
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): దసరా పర్వదినం సందర్భంగా బతుకమ్మ ఆడుతున్న మహిళల మధ్యే కొందరు యువకులు గ్రూపులుగా దాడులు చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ మినీ ట్యాంక్‌బండ్‌పై శనివారం రాత్రి జరిగింది. ఈ యువకులంతా ఎర్రగడ్డ, ఈదమ్మగుడి కాలనీకి చెందిన వారుగా స్థానికులు అనుమానించారు.
గంజాయి సేవిస్తూ తరచూ గొడవలు పడుతుంటారని ఆరోపించారు. కాగా రాత్రి 11 గంటల సమయంలో మహిళలు బతుకమ్మ ఆడుతుండగా వారి మధ్య లో చేరి స్టెప్పులేస్తూ ఇబ్బందులకు గురిచేశారు. దసరా కావడంతో పెద్దఎత్తున జనం ట్యాంకుబండ్‌పైకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.
సుమారు 30మందికిపైగా యువకు లు వర్గాలుగా పరుగులు పెడుతూ తన్నుకోవడంతో వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారు లు ఇబ్బందులు పడ్డారు. మహిళలు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. కాగా పోలీస్ రికార్డుల్లో గంజాయి బ్యాచ్‌గా ఉన్న యువకులే దాడులు చేసుకున్నట్టు తెలుస్తున్నది.
వారిని నిలువరించడంలో నిఘావర్గాలు పూర్తిగా వైఫల్యం చెందాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. డీఎస్పీ బుర్రి శ్రీనివాసులును వివరణ కోరగా విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.