కొమ్మేపల్లిలో సత్తుపల్లి పోలీసులు సీజ్ చేసిన టిప్పర్
ఖమ్మం, నవంబర్ 14 (విజయక్రాం తి): సత్తుపల్లి, వేం సూరు తదితర ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలపై విజయక్రాంతి దినపత్రికలో ఇటీవల ‘మట్టి గుట్టలు స్వాహా’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి పోలీస్, రెవెన్యూ అధికారులు స్పందించారు. గురువా రం సత్తుపల్లి మండలంలోని కొమ్మేపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నారన్న సమాచారంలో సత్తుపల్లి పోలీసులు వెళ్లి దాడులు చేశారు. జేసీబీని, టిప్పర్ను సీజ్ చేశారు.