01-04-2025 07:38:15 PM
వైరా (విజయక్రాంతి): వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంగేపు వెంకటేశ్వర్లు కవితా దంపతుల కుమార్తే సంగేపు లక్ష్మీ సాహితీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 లో 129వ ర్యాంకు సాధించడం పట్ల వైరాకు చెందిన వజినేపల్లి చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం వారి ఇంటికి వెళ్లి గ్రూప్-1 ర్యాంకర్ లక్ష్మి సాహితీని శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వజినేపల్లి చక్రవర్తి లక్ష్మీ సాహితికి స్వీట్ తినిపించి మరేన్నో ఉన్నత శిఖరాలు అవరోదించాలని ఆకాంక్షించారు. ఆ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.