calender_icon.png 26 December, 2024 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పాలనలో నిర్బంధ విద్య

04-12-2024 11:06:17 PM

బిఆర్ఎస్వి జిల్లా ఇన్చార్జ్ ముస్తఫా 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో నిర్బంధ విద్య కొనసాగుతుందని బిఆర్ఎస్వి జిల్లా ఇన్చార్జ్ ముస్తఫా ఆరోపించారు. బుధవారం తిర్యాని మండలంలో గురుకులను సందర్శించేందుకు వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నాయకులు గురుకులంను సందర్శించేందుకు అనుమతి ఇవ్వలని వారించడంతో పోలీసులు అనుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని వంటశాలను, పరిసర ప్రాంతాలను పరిశీలించిన అయన మాట్లాడుతూ.. శాంతియుతంగా సామరస్యంగా గురుకుల పాఠశాలలను సందర్శించి సమస్యలు తెలుసుకునేందుకు వెళితే గేట్లకు తాళాలు వేయడం దుర్మార్గమన్నారు.

గురుకులాల ముందు పోలీసులను ఏర్పాటు చేసి నిర్బంధంగా విద్యార్థులను జైల్లో నుంచి విద్యను అందించినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. నాసిరకం సరుకులతో విద్యార్థులకు భోజనం పెట్టడంతో ఫుడ్ పాయిజన్ అవుతున్నాయని తెలిపారు. పాఠశాలల్లో పరిసర ప్రాంతాలు దుర్గంధపు వాసన వస్తుందన్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లు పిల్లలను కలవకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శ్రీదేవి, మాజీ జెడ్పిటిసి కమల నాయకులు బాజీరావు, మధుకర్, లచ్చన్న, సరిత, అశోక్, సాగర్, తాజ్, నవీన్, రాజయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు.