హైదరాబాద్: అదానీ స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్ సర్కార్ పేరు? కీలకంగా వినిపిస్తోంది. సెకీ సంస్థతో ఒప్పందం కుంభకోణంలో ప్రముఖంగా జగన్ నేతృత్వంలోని వైసీపీ పేరు బయటకొచ్చింది. వైసీపీ హయాంలో అధికారులు రూ. 1,750 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు అధికారులు లంచం తీసుకున్నట్లు బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలున్నాయి. స్కామ్ జరిగిన కాలంలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. 2021లో అదానీ వ్యక్తిగతంగా జగన్ తో భేటీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. జగన్ తో అదానీ భేటీ తర్వాత డీల్ కుదిరినట్లు బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ లో అవినీతి కేసు నమోదైంది. సోలార్ కాంట్రాక్టుల కోసం భారత అధికారులకు లంచం ఇచ్చారని అదానీపై కేసు బుక్ చేశారు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్, మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. తప్పుడు పద్దతుల్లో అమెరికాలో పెట్టుబడులు రాబట్టారని అదానీపై ఆరోపణలు వచ్చాయి. 250 మిలియన్ డాలర్లు అధికారులకు అదానీ లంచం ఇచ్చినట్లు సమాచారం.