calender_icon.png 29 January, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవ్వా బాగున్నావా..!

21-11-2024 09:56:33 AM

ముత్తారంలో శుభాకార్యంలో వృద్ధులను ఆప్యాయతగా పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు

మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని కమాన్పూర్, రామగిరి , ముత్తారం మంథనిలో పలు వివాహ శుభ కార్యాలలో కాంగ్రెస్ సీనియర్ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముత్తారంలో పలు శుభకార్యాలలో పాల్గొన్న శ్రీనుబాబు వీధిలో నడుచుకుంటూ మహిళలను, వృద్ధులను ఆప్యాయతగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  గ్రామంలో వృద్ధులతో మాట్లాడుతూ పింఛన్ వస్తుందా అవ్వ అని ఆప్యాయతగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని పేద ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందడానికి మంత్రి శ్రీధర్ బాబు హర్నిశలు కృషి చేస్తున్నాడని వృద్ధులకు వివరించారు. అయిన వెంట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ, యూత్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ యాదవ్, మాజీ సర్పంచ్ తూటీ రజీతరఫీ, నాయకులు బియ్యని శివకుమార్, గాదం శ్రీనివాస్, కోల విజయ్ తదితరులు పాల్గొన్నారు.