దౌల్తాబాద్,(విజయక్రాంతి): సీఎం సహాయనిధి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని బీజేపీ మండల ఉపాధ్యక్షుడు స్వామి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామానికి చెందిన గడ్డమీది నాగలక్ష్మీ రూ.33వేలు, తుప్పది బాబు రూ.14,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ... మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు తిరుపతి, బిజెపి నాయకులు సత్తయ్య, వీరమ్మ యాదగిరి, వీరమ్మ చంద్రం, వేమ యాదగిరి, రాజు, సురేష్, కిష్టయ్య, చంద్రం, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.