calender_icon.png 21 November, 2024 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ

21-11-2024 03:36:12 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో రూ.360 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబులు కలిసి భూమి పూజ చేశారు. అనంతరం మంచిర్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. రోగులకు 90 శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలనే ఉద్దేశ్యంతోనే మంచిర్యాల జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు సిద్ధమైందన్నారు.

ప్రభుత్వ వైద్యులు రోగిని తమ క్లయింట్ గా భావించాలని, దవాఖానలోని వైద్య సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వైద్యులు లేరనే విమర్శలు రావొద్దని మంత్రి సూచించారు. కాంగ్రెస్ ప్రబుత్వం ఇప్పటికే 7వేలకు పైగా నర్సు పోస్టులను భర్తీ చేసిందని గుర్తుచేశారు. ప్రతి మండలానికి 2 అంబులెన్స్ లు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండేలా చూసుకుంటామని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.