వనపర్తి,(విజయక్రాంతి): సేకరించిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. గురువారం వనపర్తి మండల పరిధిలోనీ అంకుర్, ఘనపూర్ పరిధిలోని షాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు నాణ్యమైన ధాన్యం అందించాల్సి ఉంటుందని అందువల్ల నిబంధనల ప్రకారం వరి ధాన్యం తేమ, తాలు, చెత్త లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో వ్యవసాయ విస్తీర్ణాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని నిర్దేశించిన మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలని అదేవిధంగా ఆన్లైన్ లో నమోదు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.