calender_icon.png 23 October, 2024 | 12:58 AM

లోపాలు సరిచేస్తే చాలు

23-10-2024 12:00:00 AM

ప్రభుత్వం ఇప్పటికైనా ఇంటర్ వ్యవస్థను బలోపేతం చేయాలి. వచ్చే విద్యా సంత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని అంటున్నారు. ఇంటర్ వ్యవస్థను రద్దు చేసి తొమ్మిది, పది, ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఒకే దగ్గర ఏర్పాటు చేస్తామని పాలక వర్గం వారు ప్రకటించారు. దీనిపై రాష్ట్రవ్యాప్త చర్చలు విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల్లో విస్తృ తంగా జరుగుతున్నాయి.

ఇంటర్ వ్యవస్థ రద్దయితే పేద వర్గాల ప్రజలు చదివే కాలేజీలు మూత పడతాయి. ఇప్పటికే, చాలా పాఠశాలల్లో కనీస సంఖ్యలో కూడా స్ట్రెంత్ లేదు. వాటిని అప్‌గ్రేడ్ చేస్తే అవి నడువవు. అయితే, వ్యవస్థ లోపాలను సరిచేయ్యాలి. కానీ, వ్యవస్థను రద్దు చెయ్యడం సబబు కాదు. పేద పిల్లలకు మెరుగైన విద్య అందిస్తూ, మధ్యాహ్న భోజనం అందిస్తూ, ఇంటర్ స్థాయిలోనే జీవనోపాధి కల్పించే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి.

 ఉమాశేషారావు వైద్య, దోమకొం