calender_icon.png 15 January, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చలతోనే శాంతి స్థాపన

13-09-2024 01:26:02 AM

  1. రష్యా, ఉక్రెయిన్‌కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సలహా 
  2. అజిత్ దోవల్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేముందు కీలక వ్యాఖ్యలు

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 12: రష్యా, ఉక్రెయిన్ దేశాలు చర్చలు జరపడం ద్వారానే యుద్ధానికి బ్రేక్ పడే అవకాశం ఉందని, ఇరుదేశాలమ మధ్య అవగాహన ఒప్పం దం కుదర్చడానికి భారత్ సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో జరుగనున్న బ్రిక్స్ ఎన్‌ఎస్‌ఏల కీలక సమావేశంలో పాల్గొననున్న సమయంలో జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గురువారం బెర్లిన్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న జైశంకర్ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇటీవల ప్రధాని మోదీ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను దోవల్ తీసుకువెళ్తారని జైశంకర్ వెల్లడిచారు.

పుతిన్, జెలెన్‌స్కీ ఇద్దరితీ స్పేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్న అతికొద్దిమంది నాయకులలో మోదీ ఒకరని.. ఇటీవల ఇరుదేశాల పర్యటన సందర్భంగా ఈ విషయం ప్రపంచానికి తెలిసిందని జైశంకర్ వ్యాఖ్యానించారు. అలాగే భారత్ సంబంధాలపై కూడా ఇదే సమావేశంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ దేశం చైనాతో వ్యాపారం చేసేందుకు సముఖంగా లేదు. ఇరుదేశాల మధ్య బార్డర్‌కు సంబంధించి నిత్యం వివాదాలు తలెత్తున్న విషయం తెలిసిందే.

ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి..

ఉగ్రవాదం, డిజిటల్ టెక్నాలజీ ద్వారా బెదిరింపులు వంటి భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సహకరించాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బ్రిక్స్ సభ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో బుధవారం జరిగిన బ్రిక్స్ సదస్సులో దోవల్ ప్రసంగిం చారు. రోజురోజుకు పెరుగుతున్న తీవ్రవాద సమస్యను ఎదుర్కోడానికి ఉమ్మడి కార్యచరణ అవసరమని పేర్కొన్నారు. అనంతరం చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యూతో దోవల్ భేటీ అయ్యారు. కాగా బ్రిక్స్ వార్షిక సమావేశం డిసెంబర్ 22 వరకు మాస్కోల జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సహా బ్రిక్స్ దేశాల నేతలు పాల్గొననున్నారు.