calender_icon.png 17 September, 2024 | 1:49 AM

వాకిలి మెట్టుగా రూ.9 కోట్ల రాయి

07-09-2024 02:11:37 AM

బుకారెస్ట్, సెప్టెంబర్ 6: ప్రపంచంలోనే అతిపెద్దదైన ఓ అంబర్‌ను (చెట్ల నుంచి వచ్చే స్రావం గట్టిపడి వేల ఏండ్ల తర్వాత ఓ శిలాజంగా మారుతుంది. ఓ బామ్మ తెలియకుండా తన ఇంటి మెట్టుగా వాడుకుంది. కొన్నేళ్లకు ఆ రాయి విలువ తెలియడంతో అంతా విస్తుపో యారు. ఈ విషయాన్ని తాజాగా రొమేనియాలోని మ్యూజియం ఆఫ్ బుజావ్ వారు ఓ పత్రికకు వెల్లడించారు. రొమేనియాలోని కోల్టి అనే గ్రామంలో నివసించే ఓ బామ్మకు నదిలో ఓ విచిత్రమైన రాయి దొరికింది. దాన్ని ఇంటికి తీసుకొచ్చి వాకిట్లో మెట్టులా వాడింది.

ఓసారి ఆ బామ్మ ఇంట్లో దొంగలు పడి నగలు దోచుకెళ్లినా, వారికి కూడా రాయి విలువ తెలియలేదు. 1989లో బామ్మ మృతిచెందింది. తర్వాత ఆమె వారసుడికి డౌట్ వచ్చి చూడగా.. ఏదో విలువైందిగా తోచింది. దాన్ని రొమేనియా ప్రభుత్వానికే విక్రయించాడు. రాయి బరువు సుమారు 3.5 కిలోలు ఉంది. ఆ దేశ ప్రభుత్వం పోలెండ్‌కు చెందిన నిపుణులను రాయిని పరిశీలించాల్సిందిగా కోరింది. దీన్ని వారు అంబర్‌గా గురించారు. వయస్సు 7 కోట్ల ఏండ్లు ఉంటుదని, మార్కెట్ విలువ సుమా రు రూ.9 కోట్లకు పైగానే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.