calender_icon.png 17 September, 2024 | 1:42 AM

మారిన కాలం.. సాగు ఆగం

07-09-2024 02:17:13 AM

  1. అక్టోబర్ వరకు కొనసాగుతోన్న రుతుపవనాలు 
  2. దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటలపై ప్రభావం 
  3. వాతావరణ మార్పులే కారణమంటున్న నిపుణులు 
  4. పశ్చిమ భారతంలో ఏటా ఇదే తీరు 
  5. కొన్నేళ్లుగా తెలంగాణలోనూ అకాల వర్షాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశంలో రుతుపవనాల తీరు మారుతోంది. జూన్, జూలైలో కురవాల్సిన భారీ వర్షాలు ఆగస్టు, సెప్టెంబరుకు మారుతున్నాయి. ఫలితంగా వ్యవసా యం తీవ్రంగా దెబ్బతింటోంది. దేశంలో ఖరీఫ్ సీజన్ జూన్‌లో ప్రారంభమవుతుంది. రుతుపవనాల్లో తొలకరి పడటంతోనే దక్షిణాదిలో నాట్లు వేస్తారు. జూన్, జూలైలో వర్షాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. వర్షాలు లేకపోవ డంతో బోర్లు, ఇతర మార్గాల ద్వారా పంటలకు నీరందించి సేద్యం చేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురవడం వల్ల అవి కుంగిపోతున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించి పూర్తిగా పంటలు పాడవు తున్నాయి. రుతుపవనాలు లయను కోల్పోవడం వల్లనే ఇలాంటి విపత్తులు సంభవిసు ్తన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్, రాజస్థాన్ వంటి పశ్చిమ రాష్ట్రాల్లో గత దశాబ్ద కాలంగా వర్షపాతంలో 30 శాతం పెరుగుదల కనిపించింది. ఇలాం టి శుష్క, పాక్షిక శుష్క ప్రాంతాల్లో భారీ వర్షపాతం వల్ల పెద్ద అంతరాయాలు ఏర్పడి వరదలకు తద్వారా పంట నష్టానికి దారితీస్తున్నాయి.

సింధు మైదాన ప్రాంతా ల్లోనూ అక్టోబర్ వరకు వర్షాలు కొనసాగుతున్నాయి. సాధారణంగా అక్టోబర్ ప్రారం భంలో ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాలు పంటలకు సిద్ధమవుతాయి. కానీ ఈ సమయంలో అకాల వర్షా లతో పంటలు ధ్వంసమవుతున్నాయి. వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాల నాణ్యతకు ముప్పు వాటిల్లుతోంది. 

వ్యవసాయంపై ప్రభావం

ఖరీఫ్ వ్యవసాయం సకాలంలో రుతుపవనాల తిరోగమనంపై ఆధారపడుతాయి. అయితే, అక్టోబర్ వరకు రుతుపవనాలు కొనసాగడంతో వ్యవసాయ సంక్షోభానికి కారణమవుతాయని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. వరి, మొక్కజొన్న వంటివి వర్షాధార పంటలు అయినప్పటికీ కొన్ని సమయాల్లో అధిక తేమ స్థాయిలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పంటలు అధిక సున్నితత్వాన్ని కలిగి ఉండటం వల్ల పంట నష్టాల ప్రమాదం పెరుగుతోంది. ఫలితంగా పంట ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.

వ్యవసాయ మంత్రిత్వ శాఖ డాటా ప్రకారం 2015 మధ్య వరదలు, భారీ వర్షాల కారణంగా 3.39 కోట్ల హెక్టార్ల పంట దెబ్బతింది. ముఖ్యంగా పశ్చిమ భారతదేశంలో దీని ప్రభావం అధికంగా ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి నిర్వహణ సదుపాయాలు ఈ విపత్తులను నిర్వహించేందుకు సరిపోవడం లేదు. భారీ వరదలను నియంత్రించేందుకు ఉపరితల, భూగర్భ జలాల వినియోగాన్ని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

నెమ్మదిగా వస్తూ ఆలస్యంగా వెళుతూ..

ఈ ఏడాది అక్టోబర్ వరకు రుతుపవన కాలం ఉండవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా సెప్టెంబర్ నాటికి రుతుపవన కాలం అయిపోతుంది. సాధారణంగా సెప్టెంబర్ సమ యంలో హిమాలయాలను తాకి తిరోగమనం చెంది దక్షిణాంధ్ర, తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కానీ, అక్టోబర్ వరకు తెలంగాణలోనే రుతుపవనాలు కొనసాగుతాయని చెప్పడం అనూ హ్య పరిణామంగా పేర్కొనవచ్చు.

ఇది ఈ ఏడాదే జరిగిన పరిణామం కాదు. దశాబ్ద కాలంగా రుతుపవనాలు నెమ్మదిగా ప్రార ంభమవుతూ ఆలస్యంగా ముగుస్తోంది. ఈ ప్రభావంతో ఉత్తర, పశ్చిమ ప్రాంతా ల్లో ఊహించిన దానికంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, దీనిప్రభావం వ్యవసాయంపై అధికంగా పడుతోంది. రుతుపవనాల్లో ఈ అస్థిరమై న మార్పు వల్ల పంటలకు నష్టం కలుగుతోంది. వ్యవసాయ పద్ధతులను మార్చే అవసరము ందని పలువురు సూచిస్తున్నారు.

కారణాలేంటి?

దేశంలో రుతుపవనాల మార్గాన్ని వాతావరణ మార్పులు మార్చివేస్తున్నా యి. దీంతో అస్థిరమైన, తీవ్ర వర్షపాతానికి కారణమవుతోంది. సముద్రాల్లో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు వాతావరణం లో తేమ స్థాయిలను పెంచుతున్నాయి. ఫలితంగానే భారీ వర్షాలు తద్వారా తీవ్రమైన వరదలు సంభవిస్తున్నాయి. ఎల్ నినో, లానినో పరిస్థితులు వర్షపాత అస్థిరతను మరింత పెంచుతున్నాయి.

ఎల్ నినో ప్రభావం మొదట్లో రుతుపవనాలను బలహీనపరిచింది. కొన్ని ప్రాంతా ల్లో దీనివల్ల కరువు పరిస్థితులు సంభవించాయి. ఇక లానినో ప్రభావంతో అధిక వర్షాలు కురుస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం వాతావరణ మార్పులేనని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దేశంలో అస్థిర మైన వర్షపాతం వల్ల వ్యవసాయం, నీటి నిర్వహణ, రోజువారీ జీవితానికి అంతరాయం ఏర్పడుతోంది.