భద్రాచలం: కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రెండు గంటల పాటు శ్రమించి కడుపులోని కణితిని ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఈ ఘటన నిఖిత హాస్పిటల్ లో ఆదివారం చోటుచేసుకుంది. భద్రాచలం నియోజక వర్గంలోని ఆలుబాక గ్రామానికి చెందిన సిహెచ్ కుమారి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. చికిత్స కొరకు నిఖిత హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది. ఆమె వైద్యులు స్కానింగ్ తీసి ఎనిమిది కిలోల కణితి గడ్డ ఉందని తెలిపారు.
వెంటనే ఆపరేషన్ చేసి తీయాలని లేదంటే ప్రాణానికి ప్రమాదం ఉందని వెల్లడించారు. నిఖిత హాస్పిటల్ వైద్యులు భద్రాచలం నియోజక వర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, హాస్పిటల్ బృందం రెండు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి కడుపులోని కణితిని బయటకు తీశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలియజేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెకు ఆపరేషన్ చేసి కణితిని బయటకు తీసీ ప్రాణాలతో కాపాడినందుకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు.