ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, ఆయన సతీమణి సైరా భాను విడాకుల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వస్తున్న రూమర్స్‌పై సైరా స్పందించారు. ఒక ఆడియో మెసేజ్ మీడియాకు విడుదల చేశారు. ‘నేను ఫిజికల్‌గా అనారోగ్య సమస్యలను రెండు నెలలుగా ఎదుర్కొంటున్నా. కాబట్టి ఏఆర్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నా. నేను చెన్నైలో లేకుంటే, అంతా సైరా ఎక్కడంటూ ఆరా తీస్తారు.
నేను ట్రీట్‌మెంట్ కోసం ముంబై వచ్చాను. రెహ్మాన్‌ను, పిల్లల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. రెహ్మాన్‌ను నా జీవితాంతం నమ్ముతాను. ఆయన ప్రపంచంలోనే ఉత్తమమైన వ్యక్తి. నేను ఆయన్ని ఎంతలా ప్రేమిస్తానో.. ఆయన కూడా నన్ను అంతే ప్రేమిస్తారు. కాబట్టి దయచేసి ఈ తప్పుడు ఆరోపణలన్నీ ఆపేయండి. నా ఆరోగ్యం కుదుటపడిన మీదట నేను తిరిగి చెన్నైకు వస్తాను’ అని సైరా పేర్కొన్నారు.