14-04-2025 12:22:12 AM
తొలగించిన 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ..
ముషీరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): తెలంగాణలో కెసిఆర్ 11 సంవత్సరాల క్రితం తొలగించిన 26 బీసీ కులాలను తిరిగి తెలంగాణ బీసీ జాబితాలో చేర్చవద్దని ఉన్నత విద్యావంతులైన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం అని తొలగించిన 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. తోటి పేద బీసీ కులాల వారిని ఉమ్మడి రాష్ట్రంలో గత 70 సం.ల నుండి తమతోపాటే నివసిస్తున్న పేదవారిపై పరుష పదజాలం వాడడం సరికాదన్నారు. అధికారంలోకి రాగానే 26 బీసీ కులాలను తొలగించిన పేదల ద్రోహి కెసిఆర్ అని విమర్శించారు.
కాంగ్రెస్ తన ఎన్నికల వాగ్దానంగా 26 బీసీ కులాలను అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి తెలంగాణ బీసీ లిస్టులో చేరుస్తామని హామీ ఇచ్చిందన్నారు. రాష్ట్రం విడిపోతే బీసీలు ఎలా ఓసిలవుతారు? అకస్మాత్తుగా వారు విద్యావంతులు సాంఘికంగా ఉన్నతులు అయిపోతారా? అని ప్రశ్నించారు. 11 ఏళ్ల తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో బీసీ లిస్టులో ఉన్న ఏ ఒక్క తెలంగాణ బిసి కులాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ జాబితా నుండి ఇప్పటికీ తొలగించలేదన్నారు.