calender_icon.png 27 February, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దట్టమైన అడవి కింద టన్నెల్

27-02-2025 12:53:53 AM

భూఉపరితలానికి 450 మీటర్ల దిగువన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్

మల్లెల తీర్థం   జలపాతానికి సుమారు ఐదు కిలోమీటర్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాం తి): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ప్రమాదం జరిగి సుమారు ౫ రోజులు అవుతోంది. అందులో చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అయితే నల్లమ ల అడవుల కిందుగా సాగుతున్న ఈ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన ప్రదేశం.. ప్రస్తుతం బురదలో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ఉన్న ప్రాంతం.. ఎక్కడ ఉండే అవకాశం ఉందని పలువురు ఔత్సాహికులు గూగుల్ మ్యాప్స్‌లో తెగ వెతుకున్నారు.

సైన్యంతోసహా, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ అధికారులు వెల్లడించిన కోఆర్డినేట్స్ ప్రకారం ప్రమాదం జరిగిన ప్రదేశం దట్టమైన నల్లమల అడవిలోని మల్లెల తీర్థం జలపాతానికి ఆగ్నే య దిశగా సుమారు 5 కిలోమీటర్ల దూరం (ఏరియల్)లోని గుట్ట కింద ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే శ్రీశైలం రిజర్వాయర్ ఎడమ గట్టున ఎస్‌ఎల్‌బీసీ టన్నె ల్ ప్రారంభం నుంచి సుమారు 13.86 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉండటం గమనార్హం. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రారంభం సము ద్రమట్టానికి సుమారు 320 మీటర్ల ఎత్తులో ఉంది.

13.86 కిలోమీటర్ల దూరమున్న టన్నెల్ తవ్వకం పూర్తయ్యిందనుకుంటే గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించిందేందుకు ఇంత దూరంలో కనీసం 20 మీటర్ల దిగువకు టన్నెల్ వెళ్తోంద ని భావించొచ్చు. గూగల్ మ్యాప్స్‌లో చూపించిన ప్రదేశంలోని గుట్టల ప్రాంతం పైభాగం సముద్రమట్టానికి సుమారు 755 మీటర్ల ఎగువన ఉన్నట్టు తెలుస్తోంది. అంటే అక్కడ నిట్టనిలువుగా భూమి లోపలికి డ్రిల్లింగ్ చేసి చూద్దామన్నా.. కనీసం 450 మీటర్ల దిగువకు వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది.