భువనగిరి ఆర్డీవో
కార్యాలయం ఎదుట
భూ నిర్వాసిత రైతుల ధర్నా
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) అలైన్‌మెంట్ మార్చాలని నిర్వాసిత రైతులు బుధవారం ధర్నా చేపట్టారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణ కోసం అధికారులు చేపట్టిన అవార్డు విచారణను భువనగిరి మండలం రాయిగిరి, ముత్తిరెడ్డిగూడెం, గంగాసానిపల్లి గ్రామాలకు చెందిన రైతులు బహిష్కరించారు. అలైన్‌మెంట్ మార్చేవరకు ఉద్యమం కొనసాగిస్తామని ముక్తకం ఠంతో అధికారులకు తేల్చి చెప్పి అవార్డు విచారణను బహిష్కరించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ తంగెళ్లపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, పల్లెర్ల యాదగిరి, పాండు, శ్రీనివాస్, ఏవీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.