calender_icon.png 21 April, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11 తులాల బంగారం నగదు అపహరణ

21-04-2025 01:51:11 AM

నిజామాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని మిస్వావుల్ రెహమాన్ అనే వ్యక్తి తన కుటుంబంతో పాటు పనిపై హైదరాబాద్ వెళ్లగా గుర్తి తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి భారీ ఎత్తున చోరీకి పాల్పడ్డారు.

మిస్వావుల్ రెహమాన్ పడక గదిలో ఉన్న బీరువాను ధ్వంసం చేసి అందులోని 13 తులాల బంగారం 40 కులాల వెండితోపాటు  డబ్బును ఎత్తుకెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రెహమాన్ కొడుకు మరుసటి రోజు ఇంటికి రాగా ధ్వంసం అయినా ఇంటి తలుపులు బీరువా పరిస్థితిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఫిర్యాదు అందుకొని సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.