calender_icon.png 24 December, 2024 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు ఇండ్లలో భారీ చోరీ

02-11-2024 02:53:51 AM

ఓ ఇంట్లో 30 తులాల బంగారం.. 1.5 కిలోల వెండి..

  రూ.6 లక్షల నగదు అపహరణ

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మండలం కోసినిలోని బీఆర్‌ఎస్ నేత డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నివాసంతో పాటు మరో నివాసంలో బుధవారం గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. ఇంటి తాళం పగలగొట్టి ఆభరణాలు, నగదు అపహరించారు. తెలిసిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇంట్లో బుధవారం దొంగలు చొరబడ్డారు. ఇంట్లో నుంచి కొంత బంగారం, కొంత నగదు అపహరించి ఉడాయించారు. అలాగే ఇదే ప్రాంతంలోని ఓ ఇంట్లో శ్యామల నివసిస్తున్నది. బుధవారం సాయంత్రం ఆమె ఇంటికి తాళం వేసి మార్కెట్‌కు వెళ్లింది. ఆ తర్వాత గుర్తుతెలియని దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా తెరిచి 30 తులాల బంగారం, 1.5 కిలో వెండితో పాటు రూ.6 లక్షల నగదును అపహరించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా డీఎస్పీ రామానుంజయ ఘటనా స్థలాలకు వచ్చారు. పోలీస్ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు.

నిజామాబాద్‌లో జడ్జీ ఇంట్లో.. 

కామారెడ్డి,(నిజామాబాద్) నవంబర్ 1 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్జి ఇంట్లో దుండగులు గురువారం చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తాళం వేసి, పండుగ కోసం ఊరెళ్లడంతో చోరీ జరిగింది. ఇంట్లో 25 తూలాల బంగారు నగలతో పాటు నగదును దొంగిలించారు. ఈ ఘటనపై మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీమ్  ఆధారాలు సేకరించింది. జడ్జి ఇంట్లో చోరీ జరగడం నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది.