ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు ఇతర భాషల కథానాయికలతో పోలిస్తే అంతగా గ్లామర్ షోల జోలికి వెళ్లరు. ఒకరకంగా వారు వెనుకబడుతున్నారంటే అది కూడా కారణమే. తాజాగా ఈషారెబ్బ ఆ విషయాన్ని తెలుసుకున్నట్టున్నారు. పద్ధతిగా ఉంటే పనవ్వదని గ్లామర్ అవతారం ఎత్తేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే ఈషారెబ్బ ప్రస్తుతం మోడ్రన్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్నారు. లుక్ మార్చి ఫోటో షూట్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈషారెబ్బ బాగానే అవకాశాలు సంపాదించుకుంటున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల లోనూ నటిస్తున్నారు. అందం, అభినయం, కెరీర్ పరంగా సక్సెస్‌లున్నా కూడా అమ్మడికి స్టార్ హీరోల సరసన అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో రూటు మార్చాలని భావించారో ఏమో కానీ గ్లామర్ ఫోటోలతో నెట్టింట సందడి చేస్తున్నారు. మరి ఈషారెబ్బకు ఇప్పుడైనా కలిసొస్తుందో లేదో చూడాలి.