calender_icon.png 13 February, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ నిర్లక్ష్యం

13-02-2025 09:32:42 AM

గదిలో బందీగా ఒకటవ తరగతి విద్యార్ధి..!

 - తరగతి గది తాళం ధ్వంసం. 

- ఉపాధ్యాయుడిపై అగ్రహించిన తల్లిదండ్రులు. 

నాగర్ కర్నూల్, విజయక్రాంతి:  ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిర్లక్ష్యం కారణంగా ఒకటో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తరగతి గదిలోనే బందీగా మారాడు. ఇంటికి త్వరగా వెళ్లాలన్న కక్కుర్తితో తరగతి గదిలోనే ఉన్న విద్యార్థిని చూడకుండా గదికి తాళం వేసి వెళ్లడంతో విద్యార్ధి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం శాయంపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న శరత్ సాయంత్రం సమయంలో తరగతి గదిలోనే నిద్రలో జారుకున్నాడు.

అది గమనించకుండా సదరు టీచర్ నిర్లక్ష్యంగా గదికి తాళం వేసి వెళ్లిపోవడంతో రోజులాగే విద్యార్థి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు. చుట్టుపక్కల ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో పాఠశాలకు వెళ్లి పరిశీలించగా తరగతి గదిలో రోదిస్తూ కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు తరగతి గది తాళం ధ్వంసం చేసి విద్యార్థిని బయటికి తీసుకున్నారు. ఈ విషయంపై హెచ్ ఎం రమేష్ వివరణ ఇస్తూ విద్యార్థులంతా బయటే చెట్ల కింద చదువుకొని అక్కడి నుంచి అక్కడే ఇంటికి వెళ్లారని ఆ విద్యార్థి ఒక్కడే నిద్రిస్తున్న విషయం సదరు టీచర్ గమనించలేదని చెప్పుకొచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు టీచర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.