08-02-2025 01:03:38 AM
గద్వాల, ఫిబ్రవరి 7 ( విజయక్రాంతి ) : గద్వాల పట్టణంలోని వడ్ల వీధిలో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన కొళాయిలను ఒకే చోట ఐదు వరకు బిగించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొళాయిల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు బహటంగా విమర్శిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
అయితే, ఇక్కడ మాత్రం ఒకే చోట ఐదు కొళాయిలను ఏర్పాటు చేశారు. దీనివల్ల నీరు వృథాగా పోవడంతోపాటు, ప్రజలకు ఉపయోగకరంగా లేకుండా పోతున్నాయని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికయినా అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.