27-02-2025 12:46:14 AM
నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) వల్ల కలిగే చిక్కులపై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ ప్ర క్రియను ‘దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతు న్న కత్తి’గా అభివర్ణించారు. “2026 జనా భా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రమాదకరమైంది. తమిళనాడు సహ దక్షిణాది రాష్ట్రాలు జ నాభా పెరుగుదలను నియంత్రించాయి.
కానీ పార్లమెంట్‌లో మన బలం తగ్గడానికి అదే కారణమవుతో ంది. మన గొంతును అణిచివేయగలిగితే.. దానిని మనం ఎ లా సమర్థిస్తాం..” అని స్టాలిన్ ఎ క్స్‌లో పోస్ట్ చేశారు. స్టాలిన్ వ్యాఖ్యలపై కే టీఆర్ స్పందించారు. “స్టాలిన్ వ్యాఖ్యల తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ విషయ ంలో ఆయనకు మద్దతు ఇస్తున్నాను. కు టుంబ నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేసినందుకు దక్షి ణాది రాష్ట్రాలను శిక్షించలేరు” అని చెప్పారు.