calender_icon.png 7 March, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెకండియర్ పరీక్షకు 10వేలమంది గైర్హాజరు!

07-03-2025 12:50:25 AM

  1. సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌తో పరీక్షలు ప్రారంభం
  2. 4 మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు
  3. పరీక్ష కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక విద్యార్థులకు ఇబ్బందులు
  4. కొన్నిచోట్ల తాగునీటి సౌకర్యం లేదని ఆవేదన

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. సెకండ్ లాంగ్వేజ్  పేపర్ పరీక్షను విద్యార్థులు రాశారు. మొత్తం 4,52,028 లక్షల మందికి 4,40,513 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 10,823 (2.39 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు డుమ్మా కొట్టారు. జగిత్యాల జిల్లాలో 3, నిజామాబాద్ జిల్లాలో ఒక మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 

సెంటర్లలో సౌకర్యాలలేమి..

ఇంటర్ పరీక్షల నిర్వహణలో బోర్డు వైఫల్యం చెందినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సెంటర్లలో సరిగా ఏర్పాట్లు లేవని, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యా లు పట్టించుకోవడంలేదని పలువు రు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పరీక్ష కేం ద్రాల్లో విద్యార్థులు సమయం చూసుకునేందుకు కనీసం గోడ గడియారాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా రు.

ప్రతీ అరగంటకు బెల్ (గంట) మోగిస్తామన్న బోర్డు ఆదేశాలను కొన్ని కాలే జీల పట్టించుకోవడం లేదని తెలిపారు. చాలా కాలేజీల్లో కూర్చునేందుకు బెంచీ లు, కుర్చీలు సరిగాలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తాగునీటి వసతిని కూడా కల్పించలేకపోతున్నాయని పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డు నిబంధనల్లోని శ్రద్ధను ఏర్పాట్లపై పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.