16-03-2025 12:00:00 AM
హరే కృష్ణ నామ సంకీర్తనతో మార్మోగిన ఇస్కాన్ అత్తాపూర్ ప్రాంగణం
రాజేంద్రనగర్, మార్చి 15 (విజయక్రాంతి): ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, శ్రీ కృష్ణ నామాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు కృషి చేసిన మహానుభావులు, కృష్ణ భగవానుడికి ప్రతిరూ పంగా భావించే శ్రీ చైతన్య మహాప్రభువు 539వ ఆవిర్భావ తిథి అంగ రంగ వైభవంగా జరిగింది. అత్తాపూర్ లోని ఇస్కాన్ ఆలయం ఈ సందర్భంగా హరే కృష్ణ నామ జపంతో మార్మోగిపోయింది. దాదా పు 5 వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 7.30 గంటలకు దర్శన హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ చైతన్య మహాప్రభు లీలలపై ఆధ్యాత్మిక ప్రవచనాలు జరిగాయి. సాయంత్రం 5.30 గంటలకు మహా అభిషేకం, ఆరున్నరకు చప్పన్ భోగ్ నైవేద్యం, 7 గంటలకు గౌర హారతి ఇచ్చారు. 7.30 గంటల నుంచి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. శ్రీ చైతన్య మహాప్రభువు , పవిత్ర భగవన్నామమైన హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే మంత్రాన్ని సామూహిక నామ సంకీర్తన ద్వారా వ్యాప్తి చేశారు.