ఓస్లో: పాత అలవాట్లు..వదలవు నిన్ను (Old Habits die Hard).. అని సామెత వ్లాదిమీర్ పుతిన్.. పాత జాబ్.. గూఢాచారి.. ఆయన రష్యా అధ్యక్షుడు.. 25 ఏళ్లు గా పని చేస్తున్న సరే..అలా అప్పుడపుడూ పూతిన్ లో దాగి ఉన్న గూఢాచారి వృత్తి కి డైహార్డ్ ఫ్యాన్.. బయటకు వచ్చి కొన్ని స్పై ఆపరేషన్లు చేస్తూ ఉంటాడు. అలా ఈ సారి ఏకంగా కొన్ని డాల్ఫిన్లను మచ్చిక చేసుకుని వాటి మెడలో కెమెరాలను కట్టి.. యూరప్ లోని కొన్ని శత్రు దేశాల అణు స్థావరాలున్న జలాంతర్గాములు ఎక్కడ ఉన్నాయో వాటి జాడ కని పెట్టేలా పుతిన్ శిక్షణ ఇచ్చాడు. అలా ఒక డాల్ఫిన్ ను నార్వే దేశ తీర ప్రాంతంలో వదిలేశారు. దానికి నార్వేలో సైతం డైహార్డ్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. సదరు డాల్ఫిన్లు సైతం గురువును మించిన శిష్యడిలా తన విన్యాసాలతో అటు జీవకారుణ్య సంఘా కార్యకర్తలు..ఇటు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల..ను సైతం ఆకట్టుకుని ప్రపంచ వ్యాప్త సోషల్ మీడియా అభిమానులను సంపాదించుకుంది.
కానీ ఇంతలో నార్వే లోని జర్నలిస్ట్ లు జాతీయ వాదులు స్థాపించిన బారెంట్స్ అబ్జర్వర్ వెబ్‌సైట్ ఇంతలో ఒక బాంబ్ లాంటి వార్తా కథనాన్ని ప్రచురించింది. మద్దు లొలుకే డాల్ఫన్ విన్యసాలను చూసి మురిసి పోకండి బాబూ .. ఆ ను నార్వే దేశపు అణు స్థావరాల కూపీ లాగడానికి అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పంపించిన గూఢాచారి డాల్ఫిన్ అని తేల్చింది. దానికి హ్వాల్డిమిర్ అని ముద్దు పేరు సైతం పెట్టారు.
రష్యా ప్రభుత్వం కంపెనీ అయిన " సెయింట్ పీటర్స్‌బర్గ్" అని ఆ తిమింగలం మెడలోని కెమెరా పై రాసి ఉండటాన్ని మీడియా కథనానికి బలం చేకూర్చే సాక్ష్యం గా పేర్కొంది. ఈ క్రమంలో "రష్యన్ గూఢచారి తిమింగలం" అని ఆరోపిస్తూ.. హ్వాల్డిమిర్.. డాల్ఫిన్ కు మన బిగ్ బాస్ హౌస్ లో ఫ్యాన్ ఫాలోవర్లతో పాటు దేశ ద్రోహి తిమింగలం అంటూ ట్రోలింగ్ సైతం ఎదుర్కొన్నది. చివరకు నార్వేజియన్ తీరప్రాంత గార్డులు ఆగస్ట్ 31, 2024న హ్వాల్డిమిర్ ను కాల్చి చంపే శారు.
వాస్తవానికి బెలూగా జాతి డాల్ఫిన్ అయిన హ్వాల్డిమిర్ మెడ లో తాడు.. ఆ తాడుకో కెమెరా కట్టేసి ఉండగా నార్వే తీరానికి వచ్చి పోయే పడవలతో ఆడుకుంటూ ఉండేది. స్థానికులు పర్యాటకులు, చంటి పిల్లలు విసిరే పిజ్జా, బర్గర్ తదితర ఆహార పదార్థాలు తమాషాగా నోటితో అందుకునేది. వన్ వేల్ ఆర్గనైజేషన్ అనే వేల్స్ డాల్ఫిన్ల ను సంరక్షించే జీవ కారుణ్య సంస్థ హ్వాల్డిమిర్ ను కాల్చి చంపే హక్కు నార్వే ప్రభుత్వానికి లేదంటూ ప్రపంచ వ్యాప్త ఉద్య మాన్ని చేపట్టింది.
కొస మెరుపు..
ఇంతకీ ఆ డాల్ఫిన్ కు Hvaldimir అని ముద్దు పేరు.. ఎలా వచ్చిందంటే నార్వే భాషలో Hval అంటే తిమింగలం అని అర్థం.. అధ్యక్షుడు Vladimir putin లో తొలి పదం అయిన Vladimir ను కలిపి ఒక కొత్త నిక్ నేమ్ తయారు చేశారు. Hval ప్లస్ Vladimir కు సంధి కుదిర్చి Hvaldimir అనే పేరుతో సోషల్ మీడియా ట్రోలర్లు నెట్టింట్లో చెలరేగిపోయారు