calender_icon.png 16 March, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెలవు ఇవ్వాల్సిందే..

16-03-2025 12:30:01 AM

నెలసరి సమయంలో మహిళల్లో శారీరకంగా, మానసికంగా మార్పులు జరుగుతాయి. ఆ సమయంలో చాలా మంది మహిళలు అలసిపోతారు. కొందరు తీవ్రమైన కడుపునొప్పి, వెన్నునొప్పితో బాధపడతారు. మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు ప్రత్యేకంగా సెలవులను మంజూరు చేస్తున్నాయి. మహిళలకు నెలసరి సెలవులు అడగానికి అనేక కారణాలున్నాయి. అన్ని ఉద్యోగాల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు.

అయితే నెలసరి సమయంలో మాత్రం వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి నెలసరి సమయంలో వారికి సెలవు కావాలన్న విషయంపై పలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహిళా ఉద్యోగుల్లో 50 శాతం మంది తమకు నెలసరి వచ్చినప్పుడు మొదటి రెండు రోజులు సరైన నిద్ర ఉండటం లేదని, దీనివల్ల విధుల్లో ఇబ్బంది కలుగుతుందని, సరిగా పనిచేయలేకపోతున్నామని కొందరు చెప్పినట్టు సర్వేలు పేర్కొన్నాయి.

అలాగే 63.6% మంది నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారని, దీనివల్ల ఆఫీస్‌కి రాలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. 30 శాతం మంది మహిళలు నెలసరి సమయంలో వచ్చిన అనేక రకాల నొప్పులు వల్ల చాలా ఆందోళనగా, అసౌకర్యంగా అనిపిస్తుందని, ఆఫీసుల్లో ఉండలేకపోతున్నామని కొందరు అంటు న్నారు. అయితే నెలసరి సెలవు మందిదే కాని, తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.